దారుణం.. కదులుతున్న ట్రైన్‌లో యువతిపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం చేశాడు నిందితుడు.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 12:15 PM ISTదారుణం.. కదులుతున్న ట్రైన్‌లో యువతిపై అత్యాచారం
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం చేశాడు నిందితుడు. ఏసీ కోచ్‌లో ప్రయాణం చేస్తున్న యువతిపై బాత్రూమ్‌లో అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెపై దాడి చేశాడు. బాధిత యువతి కట్నీ నుంచి ఉచెహ్రాకు రైలులో వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
కట్నీ నుంచి ఉచెహ్రాకు రైలులో ఓ యువతి ప్రయాణం చేసింది. మెము రైలులోని ఏసీ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకుని ఎక్కింది. రైలు పకారియా స్టేషన్‌కు చేరుకున్న తర్వాత ఆ యువతి బాత్రూమ్‌కి వెళ్లింది. అదే సమయం అని గమనించిన అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆమె వెనకాలే బాత్రూమ్‌కి వెళ్లాడు. బలవంతంగా బాత్రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నిందితుడు బాత్రూమ్ గొళ్లెం లాక్ చేసి యువతిపై దాడి చేశాడు. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నిందితుడు బాధిత యువతితో బాత్రూమ్‌లోనే కాసేపు ఉన్నాడు. ఆ సమయంలో యువతిపై మరోసారి దాడి చేసినట్లు సమాచారం.
ఇక రైలు సత్నా స్టేషన్‌కు చేరుకోగానే బాధితులు కేకలు వేస్తూ బాత్రూమ్ డోర్‌ను ఎలాగోలా తెరుచుకుని బయటకు వచ్చింది. ఆమె అరుపులు విన్న మిగతా ప్రయాణికులు ఆమెను ఆరా తీశారు. ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో.. సత్నా స్టేషన్‌లోని జీఆర్‌పీకి అందించింది బాధిత యువతి, రైలు తదుపరి స్టేషన్‌లో ఆగడంతో.. జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు కీమా స్టేషన్‌కు చేరుకున్నాయి. బలగాలు రైలులోకి ప్రవేశించగానే నిందితుడు మళ్లీ బాత్రూమ్‌డోర్ గొళ్లెం పెట్టుకుని ఉన్నాడు. నిందితుడుని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆ డోర్‌ను పగలగొట్టారు. అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రైలులో చిరు వ్యాపారం చేస్తుంటాడని సమాచారం. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారిస్తున్నారు.