దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసకుంది.

By Srikanth Gundamalla  Published on  14 May 2024 3:02 PM IST
rape,  five years girl, Madhya pradesh,

దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసకుంది. అగర్‌ మల్వాలో ఓ ఐదేళ్ల బాలికపై అత్యాచారం సంఘటన జరిగింది. ఈ దారుణానికి బాలిక నివాసం దగ్గర్లోనే ఉంటున్న 17 ఏళ్ల మైనర్‌ బాలుడు పాల్పడ్డాడు. అయితే.. బాలికపై అత్యాచరం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని అగర్‌ మాల్వాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఇటీవల బాలికకు కడుపు నొప్పి వచ్చింది. దాంతో.. కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం సాయంత్రమే సోయెట్‌ కాలా పోలీస్‌ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. తెలిసిన అబ్బాయి కావడంతో బాలుడితో మాట్లాడింది. ఈ క్రమంలోనే బాలికను ప్రలోభపెట్టిన బాలుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని సోయెట్ కాలా పోలీస్‌ స్టేషన్ ఇన్‌చార్జ్‌ యశ్వంత్‌ రావ్ గైక్వాడ్ తెలిపారు. ఇక ఆ తర్వాత బాలికకు రాత్రి కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులతో చెప్పిందనీ.. ఆస్పత్రికి తీసుకెళ్లిన వైద్యులు అత్యాచారం జరిగిందని నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ బాలుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. బాలుడిపై పోక్సో చట్టం, లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ కోసం రూపొందించిన చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ జరుపుతున్నామనీ.. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న తెలిపారు. మరోవైపు బాలికపై అత్యాచారం చేసిన అతడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story