పుట్టపర్తి న‌గ‌ర పంచాయ‌తీ క‌మిష‌న‌ర్ ఆత్మహత్య

Puttaparthi City Panchayat commissioner commits suicide.జీవితం ఎంతో విలువైంది. అయితే.. కొంద‌రు అర్థాంత‌రంగా ప్రాణాలు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 25 Jun 2022 11:36 AM IST

పుట్టపర్తి న‌గ‌ర పంచాయ‌తీ క‌మిష‌న‌ర్ ఆత్మహత్య

జీవితం ఎంతో విలువైంది. అయితే.. కొంద‌రు అర్థాంత‌రంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. వారు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డుతుండ‌డంతో వారినే న‌మ్ముకున్న వారి కుటుంబాల ఆవేద‌న వ‌ర్ణ‌నాతీతం. అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి న‌గ‌ర పంచాయ‌తీ క‌మిష‌న‌ర్ మునికుమార్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. క‌డ‌ప శివారులోని రైల్వే గేట్ వద్ద మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. గతంలో క‌డ‌ప న‌గ‌ర పాల‌క కార్యాల‌యంలో సూప‌రింటెండెంట్‌గా ప‌నిచేసిన ఆయ‌న మూడునెల‌ల క్రితం పుట్ట‌ప‌ర్తికి డిప్యూటేష‌న్‌పై బదిలీపై వ‌చ్చారు. రెండు రోజులు సెల‌వు పెట్టి క‌డ‌ప‌కు వ‌చ్చి కుటుంబ స‌భ్యుల‌తో గ‌డిపారు. నిన్న ఇంటి నుంచి బ‌య‌లుదేరిన ఆయ‌న ఈ రోజు రాయ‌చోటి రైల్వే గేట్ వ‌ద్ద శ‌వమై క‌నిపించాడు.

Next Story