కరుడుగట్టిన హంతకుడి ఎన్‌కౌంటర్‌

Psychopathic killer' shot dead in encounter.. భోపాల్‌: కరుడుగట్టిన హంతకుడు దిలీప్‌ దేవాల్‌ హతమయ్యాడు. గుజరాత్‌లోని

By సుభాష్  Published on  4 Dec 2020 7:49 AM GMT
కరుడుగట్టిన హంతకుడి ఎన్‌కౌంటర్‌

భోపాల్‌: కరుడుగట్టిన హంతకుడు దిలీప్‌ దేవాల్‌ (38) హతమయ్యాడు. గుజరాత్‌లోని దాహూద్‌కు చెందిన దిలీప్‌కు హత్యలు చేయడంలో వెన్నతో పెట్టిన విద్య. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను టార్గెట్‌ చేసి తన గ్యాంగ్‌తో కలిసి చోరీలకు పాల్పడేవాడు. సాక్ష్యాలు మాయం చేసే క్రమంలో ఇప్పటికే ఆరుగురిని హతమార్చాడు ఈ కిల్లర్‌. ఈ క్రమంలో గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ హంతకుడి పై హత్యానేరం కింద ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి.

కాగా, గత నెల 25వ తేదీన దిలీప్‌ మధ్యప్రదేశ్‌లోని రాట్లాంలో చోరీకి పాల్పడ్డాడు. సెలూన్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి ఇటీవలే భూమి విక్రయించాడు. ఈ విషయం తెలుసుకున్న దిలీప్‌ చోటీ దీవాళి రోజున తన గ్యాంగ్‌తో కలిసి వారింటికి వెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యులు వీరిని అడ్డుకోవడంతో తుపాకీతో కాల్పులు జరిపాడు. వారి ఆర్తనాదాలు వినబడకుండబా ఉండేందుకు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఇరుగు పొరుగువారి దృష్టిని మరల్చాడు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులు గోవింద్ సోలంకి (50), అతని భార్య శారదా (45), వారి కుమార్తె (21)ను తుపాకులతో కాల్చి చంపేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

దీంతో పోలీసులు దిలీప్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దిలీప్‌ గ్యాంగ్‌లోని అనురాగ్‌ మోహర్‌, గౌరల్‌ బిల్వాల్‌,లాలా భాబోర్‌లను అరెస్టు చేశారు. దిలీప్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించగా, కాల్పులకు తెగబడుతూ పరారయ్యేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో దిలీప్‌ హతం కాగా, ఐదుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. విషయమై పోలీసులు మాట్లాడుతూ.. దిలీప్‌ సైకో కిల్లర్‌ అని, దొంగతనాలు చేసిన తర్వాత బాధితులను హత్యలు చేసేవాడని తెలిపారు. అతని గ్యాంగ్‌లో ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. గ్యాంగ్‌ నుంచి పట్టుబడ్డ వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.




Next Story