దారుణం.. గర్భిణీపై సామూహిక అత్యాచారం.. రైలు పట్టాలపై పడేశారు..!
Pregnant woman Gang raped.కఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం
By తోట వంశీ కుమార్ Published on 27 Sept 2021 5:59 PM ISTకఠిన చట్టాలు ఉన్నప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా.. ఓ గర్భిణీ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ గర్భిణీ స్మృహా కోల్పోయింది. గర్భిణీ అన్న కనికరం కూడా లేకుండా సదరు మహిళను రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాట్నాకు చెందిన ఓ 24 ఏళ్ల మహిళ గర్భంతో ఉంది. రాత్రి భోజనం అనంతరం తన నివాసం సమీపంలో వాకింగ్‌కు వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆమెను అనుసరించారు. అనంతరం గర్బిణీతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె అరవడంతో.. బలవంతంగా నోటిని మూసివేసి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడకు మరో వ్యక్తిని పిలిపించి ముగ్గరు..మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో మహిళ ప్రతిఘటించగా.. కొట్టడంతో ఆమె స్మృహ కోల్పోయింది.
గర్బిణీ అన్న కనికరం కూడా లేకుండా.. సదరు మహిళను పట్టాలపై వదిలివేసి వెళ్లిపోయారు. కొంచెం సేపటికి స్మృహలోకి వచ్చిన గర్భిణీ గట్టిగా కేకలు వేసింది. కొందరు గమనించి రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడకు వచ్చి మహిళను పోలీస్ స్టషన్‌కు తీసుకువెళ్లారు. ఈ దారుణ ఘటనపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడిన విశాల్, అంకిత్ లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు.