సినిమా బాగోలేదని అభిమాని ఆత్మహత్య

Prabhas fan commits suicide in kurnool town. ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ

By అంజి
Published on : 13 March 2022 10:24 AM IST

సినిమా బాగోలేదని అభిమాని ఆత్మహత్య

ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్‌ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల అయ్యింది. అయితే సినిమా ఈ స్లోగా ఉందని ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా చెబుతున్నారు. అలాగే ఈ సినిమాకు పలుచోట్ల మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయితే తాను ఎంతగానో అభిమానించే హీరో సినిమా చాలా రోజుల తర్వాత విడుదల కాగా, ఆ సినిమా అంచనాలకు తగ్గట్లుగా లేదని తీవ్ర నిరాశ చెందిన ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తిలక్‌నగర్‌లో నివాసం ఉండే రవితేజ అనే యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు రవితేజ విగతజీవిలా వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే యువకుడి ఆత్మహత్యకు గల కారణం ఇటీవల విడుదలైన ఓ సినిమానే కారణమని, సినిమా బాగోలేదని రవితేజ తీవ్ర చర్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు.

Next Story