కారులో ప్రముఖ సింగర్ మృతదేహం
Popular singer Vaishali Balsara was found dead in car. ప్రముఖ సింగర్ వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పద రీతిలో ఓ కారులో లభ్యం కావడం కలకలం రేపింది.
By అంజి Published on 29 Aug 2022 1:14 PM ISTప్రముఖ సింగర్ వైశాలి బల్సారా మృతదేహం అనుమానాస్పద రీతిలో ఓ కారులో లభ్యం కావడం కలకలం రేపింది.. గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వల్సాద్‌లోని పర్నాడి సమీపంలోని పార్ నది ఒడ్డున ఓ కారు చాలా సేపు ఆగి ఉంది. ఇది గమనించిన స్థానికులు కారు డ్రైవర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాడేమోనని వెతికారు. అయితే చుట్టు పక్కల ఎవరూ కనిపించలేదు.
దీంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డోర్ లాక్ ఓపెన్ చూడగా.. బ్యాక్ సీట్లో ఓ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని వల్సాద్కు చెందిన ప్రముఖ గాయని వైశాలి బల్సారాగా పోలీసులు గుర్తించారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయని మృతదేహాన్ని లోపల వదిలేసి కారుకు తాళం వేసి పరారయ్యాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైశాలి భర్త హితేశ్ కూడా సింగరే. ఇద్దరూ కలిసి చాలా స్టేజ్ షోల్లో పాల్గొన్నారు. శనివారం అర్ధరాత్రి 2 గంటలకు తన భార్య కనిపించడం లేదని హితేశ్ వల్సాద్ సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆదివారం ఉదయం వైశాలి మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పర్ణీత హత్యకు గల కారణాలు, హత్య ఎవరు చేశారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.