బీహార్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. చప్రా సివాన్ హైవే పై పోలీస్ సిబ్బందితో వెలుతున్న బస్సు ఓ ద్విచక్రవాహాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
సితాబ్దియారాలో దివగంత రాజకీయ నాయకుడు జయ ప్రకాశ్ నారాయణ 120 జయంతి వేడుకల్లో బందోబస్తు నిర్వహించిన పోలీసులు తిరిగి వెలుతుండగా.. వారు ప్రయాణిస్తున్న బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ప్రమాద ధాటికి బస్సు ఇంధన ట్యాంకు పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ముగ్గురు వ్యక్తులు మంటల్లో సజీవ దహనం అయ్యారు.
బస్సుకు మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బస్సు దిగి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోల్లో బస్సుకు మంటలు అంటుకోవడం, దాని కింద కాలిపోతున్న శరీరం, రోడ్డుపై మరో రెండు మృతదేహాలు కనిపించాయి.