పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి స్పిల్‌వే వద్ద పనులు పనులు చేస్తుండగా బీహార్‌కు చెందిన మహమ్మద్‌ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. స్పీడ్‌ ఛానల్‌లో ఉన్న నీటిలో పడటంతో గల్లంతై మృతి చెందాడు. వెంటనే సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. కార్మికుడి మృతి పట్ల తోటి కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రెండు వాహనాలను ధ్వంసం చేశారు.

పోలీసులు ప్రాజెక్టు వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ప్రస్తుతం ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టు వద్ద పనులు నిలిపివేశారు. కార్మికుడి మృతదేహాన్ని శనివారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కార్మికుడి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సుభాష్

.

Next Story