ప్లంబర్ పనికి వెళ్లి.. సీక్రెట్ కెమెరాలు.. 12 నెలల జైలు
Plumber jailed after installing secret cameras in toilets.వృత్తి రీత్యా అతడో ప్లంబర్. అయితే అతడు చేసే పని తెలిస్తే
By తోట వంశీ కుమార్ Published on 3 Nov 2021 4:56 PM ISTవృత్తి రీత్యా అతడో ప్లంబర్. అయితే అతడు చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ప్లంబింగ్ పనులకు వెళ్లిన చోట ఆ ఇంట్లోని వారికి తెలియకుండా బాత్రూమ్‌ల్లో సీక్రెట్ కెమెరాలు పెడుతుంటాడు. అలా చాలా మంది చిన్నారులు, మహిళల నగ్న ఫోటోలు సేకరించాడు. ఓ మహిళ స్నానం చేస్తూ.. పైపు దగ్గర ఉన్న సీక్రెట్ కెమెరాను గుర్తించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా.. కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ ఘటన బ్రిటన్‌లో జరిగింది.
57 ఏళ్ల జేమ్స్ హుల్మ్ ప్లంబర్‌గా పనిచేసేవాడు. 2018లో ఓ మహిళ ఇంట్లో ప్లంబింగ్ పని ఉండడంతో ఆమె జేమ్స్ హుల్మ్‌ను సంప్రదించింది. పనిని చక్కగా పూర్తిచేసిన జేమ్స్ హుల్మ్ ఆ మహిళకు తెలియకుండా బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాను అమర్చాడు. ఓ రోజు స్నానం చేస్తూ.. సదరు మహిళ కెమెరాను గమనించింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో సీక్రెట్ కెమెరాను అమర్చింది జేమ్స్‌గా తేల్చారు. అతడి ఇంటి అడ్రస్ కనుగొని ఇంటికి వెళ్లారు.
అతడి ఇంట్లో ఉన్న ఓ సిస్టమ్‌లో చూడగా.. అందులో 302 మంది చిన్నారుల అశ్లీల చిత్రాలతో పాటు మహిళలు, ఆఖరికి జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో ప్రవేశ పెట్టగా.. జేమ్స్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం అతడికి 12 నెలల జైలు శిక్ష విధించింది.