ఫిబ్రవరి 15న రైల్వే పోలీసులు (జిఆర్‌పి), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారులు ఓ బ్యాగ్ ను గౌహతి రైల్వే స్టేషన్‌లో ఓపెన్ చేయగా ఏకంగా కోటి రూపాయలకు పైనే డబ్బు ఉన్న బ్యాగ్ లభించింది. ముగ్గురు అనుమానిత వ్యక్తుల నుండి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అభిషేక్ శర్మ, ఉమేష్ చంద్ర శర్మ, పవన్ కుమార్‌లను ముగ్గురు అనుమానితులుగా గుర్తించారు. పవన్ ఢిల్లీకి చెందిన వ్యక్తి కాగా, అభిషేక్, ఉమేష్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు. పల్టాన్ బజార్ ప్రవేశ ద్వారం వద్ద పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే డబ్బు దొరికింది. మొత్తం స్వాధీనం డబ్బు విలువ 1,48,30,600 రూపాయలు. ఈ డబ్బును అరుణాచల్‌ప్రదేశ్ నుంచి తీసుకొచ్చారని, ఈ ముగ్గురూ ఢిల్లీకి తరలిస్తున్నట్లు భావిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బును కలిగి ఉన్న వీళ్లు.. ఎలాంటి డాక్యుమెంటేషన్‌ను చూపించలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలపై విచారణ కొనసాగుతోంది.
మరో వైపు ఫిబ్రవరి 14న, నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారులు డిబ్రూఘర్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ లో అత్యాచార నిందితుడిని పట్టుకున్నారు. ఖలీల్ ఇస్లాం అనే 18 ఏళ్ల యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది. అతనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖలీల్‌ను అరెస్టు చేసినప్పుడు అతడు అస్సాంకు వెళుతున్నట్లు సమాచారం