లైంగికవాంఛ తీర్చ‌లేద‌ని... వృద్దురాలిని ముక్క‌లుగా న‌రికి దారుణ హ‌త్య

Old Woman Brutal Murder in Khammam.లైంగికవాంఛ తీర్చ‌లేద‌ని ఓ వృద్దురాలిని కిరాతంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌ ఖ‌మ్మం జిల్లాలో వెలుగుచూసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 April 2021 7:35 AM IST
brutal murder in Khammam

దేశంలో ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చిన‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. కామాందులు క‌న్ను మిన్ను కాన‌క‌.. చిన్నారుల నుంచి వృద్ద మ‌హిళ‌ల పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. లైంగికవాంఛ తీర్చ‌లేద‌ని ఓ వృద్దురాలిని కిరాతంగా హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌ ఖ‌మ్మం జిల్లాలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. కారేప‌ల్లి మండ‌లం బ‌జ్వాతండాలో అజ్మీర నాజీ(69)అనే వృద్దురాలు నివ‌సిస్తోంది. ఆమె భ‌ర్త 20 ఏళ్ల క్రితం మ‌ర‌ణించాడు. ఈమెకు ముగ్గురు కుమారులు, ఓ కుమారై ఉన్నారు.

కారేప‌ల్లికి చెందిన ఆదెర్ల ఉపేంద‌ర్‌(43) ఆమెపై కొద్ది రోజుల క్రితం అత్యాచారం చేసేందుకు య‌త్నించాడు. ఈ విష‌యాన్ని ఆమె గ్రామంలోని అంద‌రికి చెప్పింది. దీంతో ఆ వృద్దురాలిపై క‌క్ష్య గట్టాడు ఉపేంద‌ర్‌. ఈ నెల 26న‌(సోమ‌వారం) రాత్రి స‌మ‌యంలో ఆమెను బ‌ల‌వంతంగా చీమ‌లపాడు ర‌హ‌దారి వైపు తీసుకెళ్లాడు. అక్క‌డ ఆమె కాళ్లు, చేతులు, త‌ల భాగాల‌ను న‌రికి దారుణంగా హ‌త‌మార్చి అక్క‌డే కాల్చేశాడు. మొండెం భాగాన్ని మ‌హ‌బూబాబాద్ జిల్లా గార్ల మండ‌లం తిర్లాపురం రైల్వే ట్రాక్‌పై ప‌డేశాడు.

వెలుగులోకి వ‌చ్చింది ఇలా..

అడ‌వి పందిని కాల్చి బ‌స్తాలో మూట‌గ‌ట్టాన‌ని.. ఊరి శివారులో ప‌డేసి వ‌ద్దామ‌ని ఉపేంద‌ర్ స్థానికంగా ఉండే ఓ యువ‌కుడి సాయాన్ని తీసుకున్నాడు. స్నేహితుడి బైక్‌పై వెళ్లి ఓ చోట ప‌డేశాడు. అనుమానం వ‌చ్చిన ఆ యువ‌కుడు బ‌స్తా విప్పి చూశాడు. మ‌నిషిని పోలిన విధంగా ఉండ‌డంతో.. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. రంగంలోని దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. నాజీని హ‌త్య‌చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. నాజీ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.


Next Story