పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. 8 ఏళ్ల బాలిక‌పై వృద్ధుడి అఘాయిత్యం

Old man molested 8 years girl in West Godavari district.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Feb 2022 12:35 PM IST
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం.. 8 ఏళ్ల బాలిక‌పై వృద్ధుడి అఘాయిత్యం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌లేడం లేదు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా కామంతో క‌ళ్లు మూసుకుపోయిన కామాంధులు మ‌హిళ‌ల‌పై అత్యాచారాల‌కు తెగ‌బ‌డుతున్నారు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌లు ఆఘాయిత్యాల‌కు బ‌ల‌వుతూనే ఉన్నారు. మ‌న‌వ‌రాలి వ‌య‌స్సు ఉన్న ఓ బాలిక‌పై ఓ దుర్మార్గుడు లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రిగింది.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా గోపాల‌పురం మండ‌లం గోప‌వ‌రంలో 8 ఏళ్ల బాలిక త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి నివ‌సిస్తోంది. బాలిక త‌ల్లిదండ్రులు కూలీ ప‌నులు చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో రోజులాగే త‌ల్లిదండ్రులు కూలీ ప‌నుల‌కు వెళ్లారు. బాలిక ఒక్క‌తే ఇంట్లో ఉండ‌టాన్ని గ‌మ‌నించిన ఓ వృద్దుడు ఇంట్లోకి చొర‌బ‌డి బాలిక‌పై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. బాలిక భ‌యంతో కేక‌లు వేయ‌డంతో అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. బాలిక జ‌రిగిన విష‌యాన్ని మొత్తం త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌గా.. వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌రారీలో ఉన్న అత‌డి కోసం గాలింపు చేప‌ట్టారు.

Next Story