షాకింగ్.. ఆడ కుక్కపై 65 ఏళ్ల వృద్దుడి లైంగిక దాడి

Old man arrested for raping female dog.పుణెలోకి చాతుస్రుంగి ప‌రిధిలో ఓ వృద్దుడు అక్టోబ‌ర్ నుంచి ఓ ఆడ‌కుక్క‌పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 April 2021 12:19 PM IST
dog

నిత్యం దేశంలో ఏదో ఒక్క చోట మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు జ‌రిగిన ఘ‌ట‌న‌లు వింటూనే ఉన్నాము. అయితే.. కామంతో క‌ల్లు మూసుకుపోయిన ఓ వృద్దుడు.. ఓ ఆడ కుక్క‌పై కొన్నాళ్లుగా లైంగిక దాడికి పాల్ప‌డ్డుతున్నాడు. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా ఉన్న ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పుణే జిల్లాలో జ‌రిగింది. ఈ నీచ ఘ‌ట‌న సీసీకెమెరాల్లో రికార్డు అవ‌డంతో వెలుగుచూసింది. ఆదివారం రాత్రి ఆ కామాందుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. పుణెలోకి చాతుస్రుంగి ప‌రిధిలో ఓ వృద్దుడు (65) నివాసం ఉంటున్నాడు. అత‌డు మోడ‌ల్ కాల‌నీ పార్కింగ్ ఏరియాలో గ‌త అక్టోబ‌ర్ నుంచి ఓ ఆడ‌కుక్క‌పై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

గ‌త కొద్ది రోజులుగా ఆ వృద్దుడు ఓ కుక్క‌ను పార్కింగ్ ప్రాంతంలో తీసుకెళ్ల‌డం కొంద‌రు స్థానిక యువ‌కులు గ‌మ‌నించారు. అయితే.. తొలుత దీనిని అంత‌గా ప‌ట్టించుకోక‌పోయిన‌ప్ప‌టికి త‌రువాత వారికి అనుమానం వ‌చ్చింది. అక్క‌డ జ‌రిగే ఘ‌ట‌నను చూసి వారు షాక్‌కు గురైయ్యారు. అనంత‌రం ఈ విష‌యాన్ని జంతు సంర‌క్ష‌ణ చూసే స్థానిక స్వ‌చ్చంద సంస్థ‌కు చెప్పారు. అయితే.. అత‌డిని ప‌ట్టించ‌డానికి సాక్షాలు కావాల‌ని బావించిన వారు.. ఆ పార్కింగ్ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే.. సీసీ కెమెరాలు ఉన్న విష‌యం గ‌మ‌నించని ఆ వృద్దుడు కెమెరాలు అమర్చిన మూడు రోజల తర్వాత రాత్రి పూట మెల్లగా నడుచుకుంటూ కుక్క దగ్గరకు వచ్చాడు.

ఆ కుక్క ప‌క్క‌న కూర్చుని దాన్ని ప్రేమ‌గా నిమిరాడు. అనంత‌రం ఆ ఆడ కుక్క‌ను ఎత్తుకుని పార్కింగ్ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అక్క‌డ దానిపై అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఈ దృశ్యాల‌న్ని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వెంట‌నే వారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. సీసీటీవీ పుటేజీల‌ను ప‌రిశీలించిన అనంత‌రం ఆదివారం రాత్రి 9 గంట‌ల‌కు ఆ వృద్దుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుక్కను స్వఛ్చంద సంస్ధ సంరక్షణకు పంపారు.




Next Story