దారుణం.. వృద్ద దంప‌తుల దారుణ హత్య‌

Old Couple Brutally Murdered in Kadapa.క‌డ‌ప జిల్లాలో దారుణం జ‌రిగింది. వృద్ద దంప‌తుల‌ను దారుణంగా హ‌త‌మార్చారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Sep 2021 5:24 AM GMT
దారుణం.. వృద్ద దంప‌తుల దారుణ హత్య‌

క‌డ‌ప జిల్లాలో దారుణం జ‌రిగింది. వృద్ద దంప‌తుల‌ను దారుణంగా హ‌త‌మార్చారు. ఈ ఘ‌ట‌న బ్ర‌హ్మంగారి మ‌ఠం మండ‌లం కొత్త బ‌సాపురంలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. కొత్త బసాపురంలో నాగ‌య్య‌-నాగ‌మ్మ దంప‌తులు నివ‌సిస్తున్నారు. య‌ధావిధిగా గురువారం రాత్రి వారు నిద్ర‌పోయారు. అయితే.. శుక్ర‌వారం ఎంత సేపు అయిన‌ప్ప‌టికి వారు బ‌య‌ట‌కు రాలేదు. దీంతో ఇరుగుపొరుగు వారు లోనికి వెళ్లి చూడ‌గా.. మంచంపై ర‌క్త‌పు మ‌డుగులో విగ‌త జీవులుగా ప‌డి ఉన్నాడు.

పోలీసులకు స‌మాచారం అందించ‌గా.. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత‌దేహాల‌ను ప‌రిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగా.. వృద్ద‌దంప‌తుల‌ను హ‌త్య చేసింది వీర‌య్య‌గా గుర్తించారు. నాగ‌మ్మకు స్వ‌యానా చెల్లెలు కొడుకే ఈ వీర‌య్య. మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేక పెద్దమ్మ నాగ‌మ్మ, పెద్దనాన్న నాగ‌య్య ల‌ను హ‌త్య చేసిన‌ట్లు స్థానికులు అంటున్నారు. హ‌త్యలు చేసిన వీరయ్య ఆ ప్ర‌దేశంలోని ఓ ఇంట్లో దాక్కొని ఉండ‌గా.. పోలీసులు అత‌డిని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it