ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో వన్యప్రాణులను చంపేందుకు వేటగాళ్లు వేసిన లైవ్ కరెంట్ వైర్‌కు తగిలి ఒక వ్యక్తి, అతని భార్య మరణించినట్లు అధికారులు మంగళవారం తెలిపారు. ఆ ప్రాంతంలో టీ స్టాల్ నడుపుతున్న బోలారం గాలెల్, బాల గాలెల్ అనే దంపతులు సోమవారం (జనవరి 20) కట్టెలు సేకరించేందుకు అడవిలోకి వెళ్లిన సంఘటన గెరుపుట్ గ్రామంలో చోటుచేసుకుంది. గంటల తర్వాత కూడా దంపతులు తిరిగి రాకపోవడంతో వారి కుటుంబసభ్యులు, స్థానిక గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టారు.
"జంట అడవి నుండి తిరిగి రాకపోవడంతో, స్థానికులు వెతకడం ప్రారంభించారు . ఆ రాత్రి తరువాత, అడవి జంతువులను చంపడానికి వేటగాళ్ళు మోహరించిన విద్యుత్ తీగలో జంట మృతదేహం చిక్కుకుపోయిందని వారు కనుగొన్నారు" అని ఒక అధికారి తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అడవిలో తరచూ కనిపించే అడవి పందులను వేటాడేందుకు లైవ్ వైర్లను ఏర్పాటు చేశారు.
ఇద్దరు వ్యక్తులు అడవిలో లైవ్ వైర్లు ఏర్పాటు చేశారని బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రెండో నిందితుడు పరారీలో ఉన్నాడు. భార్యాభర్తల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.