రిపబ్లిక్ డేకు ముందుగా.. 13 పిస్టల్స్, 38 లైవ్ కాట్రిడ్జ్‌లతో పట్టుబడ్డ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
Notorious smuggler Shakeel arrested.జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని
By M.S.R Published on 19 Jan 2022 11:20 AM ISTజనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే..! దీంతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇలాంటి సమయంలో ఢిల్లీ పోలీసులు సోమవారం అర్థరాత్రి రోహిణి సెక్టార్-35 ప్రాంతంలో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న కపిల్ సాంగ్వాన్ ముఠాకు చెందిన నొటోరియస్ క్రిమినల్ ను అదుపులోకి తీసుకున్నారు. 36 ఏళ్ల ఆయుధాల స్మగ్లర్ షకీల్ అలియాస్ షెర్నీను అరెస్టు చేశారు. జహంగీర్ పురీకి చెందిన షకీల్ కొన్నేళ్ల నుండి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తూ వస్తున్నాడు. రెండు గ్రూప్ ల మధ్య ఓ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో చాలా మంది పారిపోయారు. ఇరువర్గాల మధ్య డజను రౌండ్లకు పైగా కాల్పులు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
డీసీపీ ఔటర్ నార్త్ బ్రిజేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు షకీల్ వద్ద నుంచి 13 అత్యాధునిక పిస్టల్స్, 38 రకాల లైవ్ కాట్రిడ్జ్‌లతో నింపిన బ్యాగ్ లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా ఢిల్లీ పోలీసులు రోహిణి సెక్టార్-35 UER-II సమీపంలో ట్రాప్ వేశారని, నిందితుడు బైక్‌పై రోహిణి సెక్టార్ 29 వైపు వస్తుండగా అడ్డుకున్నారని డీసీపీ తెలిపారు. .
కపిల్ సంగ్వాన్ నందు, జ్యోతి బాబా ముఠా మరియు సిసోడియా గ్యాంగ్‌కు చెందిన కరుడుగట్టిన ఆయుధాల స్మగ్లర్ షకీల్ అలియాస్ షెర్నీ కదలికల గురించి కానిస్టేబుల్ ప్రదీప్‌కు ఇన్‌ఫార్మర్ ద్వారా సమాచారం అందినట్లు పోలీసు అధికారి తెలిపారు. UER-II సమీపంలో పోలీసులు ఒక ట్రాప్ వేసినట్లు తెలుస్తోంది. సెక్టార్ -35 సమీపంలో మోటారుసైకిల్‌పై వస్తున్న నిందితుడు షకీల్‌ను పోలీసులు ఆపినప్పుడు, అతను పోలీసులను చూసి కాల్పులు ప్రారంభించాడు. ఆ తర్వాత పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు.