రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

గుజరాత్ తీరానికి సమీపంలో రూ.1800 కోట్ల విలువైన దాదాపు 300 కిలోల మాదకద్రవ్యాలను నార్కోటిక్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

By అంజి
Published on : 14 April 2025 11:00 AM IST

Narcotics, Gujarat Coast, IMBL, ATS, ICG

రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

గుజరాత్ తీరానికి సమీపంలో రూ.1800 కోట్ల విలువైన దాదాపు 300 కిలోల మాదకద్రవ్యాలను నార్కోటిక్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ 12 మరియు 13 తేదీలలో రాత్రి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌తో కలిసి భారత కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐసిజి నౌకను గుర్తించిన స్మగ్లర్లు నిషిద్ధ వస్తువులను పారవేసి అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటి పారిపోయారు.

ఐసిజి షిప్ వరద్, అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) వద్ద గస్తీ తిరుగుతున్నప్పుడు, అనుమానాస్పద కదలికలను ప్రదర్శించే ఒక ఫిషింగ్ బోట్‌ను గుర్తించి, వెంటనే బోర్డింగ్ విధానాలను ప్రారంభించింది. ఐసిజి ఓడను గుర్తించిన స్మగ్లర్లు ఆ నిషిద్ధ వస్తువులను పారవేసి ఇంటర్నేషనల్‌ బోర్డర్‌ వైపు పారిపోయారు. వెంటనే సిబ్బంది నీళ్లలో మునిగిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10న, బంగాళాఖాతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపిస్తూ భారత తీర రక్షక దళం ఒక భారతీయ ఫిషింగ్ పడవను పట్టుకుంది.

Next Story