పని మొదలెట్టిన 'ఈగల్' టీమ్.. మియావ్ మియావ్ డ్రగ్‌ స్వాధీనం

కొత్తగా ఏర్పడిన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) టీమ్ నాంపల్లి పోలీసులతో కలిసి హైదరాబాద్‌లో మియావ్ మియావ్‌ డ్రగ్‌ను అమ్ముతున్న వ్యక్తులను పట్టుకున్నారు.

By Medi Samrat
Published on : 9 July 2025 7:56 PM IST

పని మొదలెట్టిన ఈగల్ టీమ్.. మియావ్ మియావ్ డ్రగ్‌ స్వాధీనం

కొత్తగా ఏర్పడిన ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) టీమ్ నాంపల్లి పోలీసులతో కలిసి హైదరాబాద్‌లో మియావ్ మియావ్‌ డ్రగ్‌ను అమ్ముతున్న వ్యక్తులను పట్టుకున్నారు. 100 గ్రాముల మెఫెడ్రోన్‌ను కలిగి ఉన్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితులు ముంబైకి చెందిన అజయ్ కుమార్ చౌదరి (43), రంగారెడ్డి జిల్లాకు చెందిన సయ్యద్ జహీర్ (32) నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు మాదకద్రవ్యాన్ని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు.

మెఫెడ్రోన్ లేదా మియావ్ మియావ్ డ్రగ్ ను కొకైన్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తూ ఉంటారు. తెల్లటి పొడి, క్యాప్సూల్స్ లేదా టాబ్లెట్ల రూపంలో దొరుకుతూ ఉంటుంది.

Next Story