పూణే-ముంబై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
Mumbai-Pune Highway Accident 5 killed.పూణే-ముంబై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు కంటైనర్‌ను
By తోట వంశీ కుమార్ Published on
30 Jan 2022 7:02 AM GMT

పూణే-ముంబై జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 5 ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. లోనావాలాలోని షీలత్నే గ్రామ సమీపంలోని పుణె-ముంబై జాతీయ రహదారిపై ముంబై నుంచి పుణెకు అతి వేగంగా వెలుతున్న ఓ ఫోర్డ్ కారు అదుపు తప్పి ఢి వైడర్‌ను ఢీ కొట్టింది. అయినప్పటికా కారు ఆగకుండా రోడ్డు అవతలి వైపు ఎదురుగా వస్తున్న ఓ కంటైనర్ కిందకు దూసుకువెళ్లింది.
కంటైనర్ కింద కారు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కారును కంటైనర్ కింద నుంచి బయటకు లాగారు. కారులోంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను గుర్తించాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story