విదేశీ మహిళ ముందు డ్రైవర్‌ పాడు పని.. టాక్సీ నడుపుతూనే..

Mumbai police arrested taxi driver for misbehave and badly treat to foreign women. ముంబైలో వాకింగ్‌కు వెళ్లిన ఓ అమెరికన్ మహిళకు టాక్సీ డ్రైవర్ చేసిన పాడు పనితో వింత అనుభవం

By అంజి  Published on  29 Nov 2022 1:12 PM IST
విదేశీ మహిళ ముందు డ్రైవర్‌ పాడు పని.. టాక్సీ నడుపుతూనే..

ముంబైలో వాకింగ్‌కు వెళ్లిన ఓ అమెరికన్ మహిళకు టాక్సీ డ్రైవర్ చేసిన పాడు పనితో వింత అనుభవం ఎదురైంది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఓ అమెరికన్ మహిళ ముందు హస్తప్రయోగం చేసిన టాక్సీ డ్రైవర్‌ను అంధేరీ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన టాక్సీ డ్రైవర్‌ను యోగేంద్ర ఉపాధ్యాయ్‌గా గుర్తించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. అమెరికన్ మహిళ ప్రైవేట్ టాక్సీని బుక్ చేసుకుంది. ట్యాక్సీలో ప్రయాణిస్తుండగా అంధేరీ ప్రాంతానికి చేరుకోగానే, టాక్సీ డ్రైవర్ మహిళ ముందు హస్తప్రయోగం ప్రారంభించాడు. క్యాబ్‌లో మహిళను డ్రైవర్‌ లైంగికంగా వేధించాడు.

క్యాబ్ (టాక్సీ) డ్రైవర్ చేసిన ఈ చర్యతో ఆ మహిళ చాలా కంగారు పడింది. ఈ విషయం ఆ మహిళకు మొదట అర్థం కాలేదు. అయితే ఆ మహిళ గట్టిగా అరవడం ప్రారంభించింది. ప్రజలు గుమిగూడారు. ఈలోగా టాక్సీ డ్రైవర్ యోగేంద్ర ఉపాధ్యాయ్ తప్పించుకున్నాడు. అయితే అంధేరీ పోలీసులు గంట వ్యవధిలోనే టాక్సీ డ్రైవర్‌ యోగేంద్ర ఉపాధ్యాయ్‌ను అరెస్ట్‌ చేశారు. క్యాబ్‌ డ్రైవర్‌పై ఐపీసీ సెక్షన్‌ 354, 509 కింద కేసు నమోదు చేసి ఆదివారం బాంద్రాలోని హాలిడే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని రెండు రోజుల కస్టడికీ పంపింది.

అమెరికాకు చెందిన 40 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త పని నిమిత్తం నెల రోజుల క్రితం భారత్‌కు వచ్చి అప్పటి నుంచి ముంబైలో ఉంటున్నారు.

Next Story