ప్రైవేట్ వీడియో లీక్ బెదిరింపులతో.. చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్‌మోర్ ఆత్మహత్య
ముంబైలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు.. అతడి ప్రైవేట్ అడల్ట్ వీడియోను లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో..
By అంజి
ప్రైవేట్ వీడియో లీక్ బెదిరింపులతో.. చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్‌మోర్ ఆత్మహత్య
ముంబైలో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు.. అతడి ప్రైవేట్ అడల్ట్ వీడియోను లీక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో మనస్థాపానికి గురై చార్టర్డ్ అకౌంటెంట్ రాజ్‌మోర్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు మంగళవారం తెలిపారు. రాజ్ మోర్ శనివారం రాత్రి శాంటాక్రూజ్‌లోని తన నివాసంలో విషం తాగినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోరే మూడు పేజీల సూసైడ్ నోట్‌ను రాశాడు. అందులో ఇద్దరు వ్యక్తులు - సబా ఖురేషి, రాహుల్ పర్న్వానీ - తాను ఈ తీవ్రమైన చర్య తీసుకోవడానికి కారణమని పేర్కొన్నారు. ఇద్దరిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం, బలవంతంగా వసూళ్లు చేయడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేశారు.
గత 18 నెలలుగా, నిందితులిద్దరూ- వారిలో ఒక మహిళ - ప్రైవేట్ వీడియోను పబ్లిక్ చేస్తామని బెదిరించి మోర్ నుండి దాదాపు రూ. 3 కోట్లు వసూలు చేశారని పోలీసులు తెలిపారు. రాజ్ మోర్ ఒక ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడని, గణనీయమైన పెట్టుబడులు పెట్టాడని వర్గాలు తెలిపాయి. అతనికి సోషల్ మీడియా ద్వారా సబా ఖురేషితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత, రాహుల్ పర్న్వానీ తనకు తెలియకుండానే మోర్ యొక్క సన్నిహిత వీడియోలను రికార్డ్ చేశారు.
పోలీసుల ఫిర్యాదు ప్రకారం, నిందితులిద్దరూ మోర్ వకోలా నివాసం వద్దకు వచ్చి అతని తల్లి ముందే అతనిపై దాడి చేసి, దుర్భాషలాడి, వీడియోను విడుదల చేస్తామని మరోసారి బెదిరించడంతో పరిస్థితి మరింత దిగజారింది. నిరంతర బ్లాక్‌మెయిల్, బెదిరింపులతో కుంగిపోయిన మోర్ ఆ రాత్రి తరువాత విషం తాగాడు. అతని సూసైడ్ నోట్‌లోని విషయాలు, అతని కుటుంబం నుండి వచ్చిన వాంగ్మూలాల ఆధారంగా, ముంబై పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకుని అరెస్టు చేయడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు.