క‌డ‌ప‌లో దారుణం.. సోద‌రిని చంపింద‌ని త‌ల్లిని హ‌త‌మార్చిన కొడుకు

Mother killed Daughter and Son killed Mother in Kadapa.క‌డ‌ప ప‌ట్ట‌ణంలో దారుణం చోటు చేసుకుంది. ఫోన్ మాట్లాడం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2021 5:45 PM IST
క‌డ‌ప‌లో దారుణం.. సోద‌రిని చంపింద‌ని త‌ల్లిని హ‌త‌మార్చిన కొడుకు

క‌డ‌ప ప‌ట్ట‌ణంలో దారుణం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఎక్కువ‌గా వాడుతోంద‌ని త‌ల్లి, కుమారైకు మ‌ధ్య గొడ‌వ జ‌రుగ‌గా.. ఆవేశంలో త‌ల్లి.. కుమారై మెడ‌కు ఉరి బిగించి హ‌త్య చేసింది. అది చూసిన కుమారుడు త‌న అక్క‌నే చంపేస్తావా అంటూ త‌ల్లిని క‌త్తితో పొడిచి దారుణంగా హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. క‌డ‌ప ప‌ట్ట‌ణంలోని న‌కాశ్ వీధిలో షేక్ హుసేన్‌, ఖుర్షీదా(47) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి కుమారై అలీమా(14), కొడుకు జ‌మీర్ సంతానం. కొద్దికాలం క్రితం భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుడంతో ఇద్ద‌రు వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవ‌ల అలీమా.. సెల్‌ఫోన్‌ను ఎక్కువ‌గా వాడుతోంది. ఈ విష‌య‌మై అలీమా, ఖుర్షీదా మ‌ధ్య బుధ‌వారం రాత్రి గొడ‌వ జ‌రిగింది. దీంతో స‌హ‌నం కోల్పోయిన ఖుర్షీదా.. చున్నీతో అలీమా మెడ‌కు ఉరి బిగించి హ‌త్య చేసింది. అక్క‌డే ఉన్న జ‌మీర్.. అలీమా మృతిని జీర్ణించుకోలేక‌పోయాడు. అక్క‌నే చంపేస్తావా అంటూ త‌ల్లి ఖుర్షీదా పై ప‌క్కనే ఉన్న క‌త్తితో పొడిచి హ‌త్య చేశాడు. స్థానికుల స‌మాచారంతో ఘ‌ట‌నాస్థ‌లానికి పోలీసులు చేరుకుని మృత‌దేహాల‌ను ప‌రిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాల‌ను స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి జ‌మీర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story