దారుణం.. కొడుకుకు దెయ్యం పట్టిందని కొట్టి చంపిన తల్లి

Mother killed 7years old son in Tamilnadu.సైన్స్ ఎంత‌గా అభివృద్ది చెందుతున్నా.. కొంత మంది ఇంకా మూఢ‌న‌మ్మ‌కాల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jun 2021 11:10 AM GMT
దారుణం.. కొడుకుకు దెయ్యం పట్టిందని కొట్టి చంపిన తల్లి

సైన్స్ ఎంత‌గా అభివృద్ది చెందుతున్నా.. కొంత మంది ఇంకా మూఢ‌న‌మ్మ‌కాల‌ను విడ‌వ‌డం లేదు. కుమారుడికి దెయ్యం ప‌ట్టింద‌ని ఓ స్వామిజీ చెప్ప‌డంతో.. ఓ ఏడేళ్ల బాలుడి త‌ల్లి.. ఆ బాలుడిని మూడు రోజులుగా కొడుతూనే ఉంది. ఆమెతో పాటు మ‌రో ముగ్గురు మ‌హిళ‌లు కూడా ఆ బాలుడిని విచ‌క్షణార‌హితంగా కొట్ట‌డంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. తిరువన్నామలై జిల్లా అరణిలో ఓ ఏడేళ్ల బాలుడు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అయితే.. కొద్ది కాలంగా ఆ బాలుడికి మాన‌సిక స్థితి స‌రిగ్గా లేదు. దీంతో అత‌డి త‌ల్లి ఓ స్వామీజిని క‌లిసింది. ఆమె కుమారుడికి దెయ్యం ప‌ట్టింద‌ని స‌ద‌రు స్వామీజి చెప్పాడు. దాంతో కొడుకు పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించింది. దెయ్యం తన కొడుకును ఆవహించిందని మూడు రోజులుగా కొడుతూనే ఉన్నారు. ఆమెతో పాటు మరో ముగ్గురు అత్యంత రాక్షంగా వ్యవహరించారు.

ఏడేళ్ల బాలుడిని దారుణం హింసిస్తున్నార‌నే స‌మాచారం పోలీసుల‌కు అందింది. అయితే.. పోలీసులు అక్క‌డికి చేరుకునే లోపే చిత్ర‌హింస‌ల‌తో బాలుడు మృతి చెందాడు. బాలుడి త‌ల్లితో స‌హా ముగ్గురు మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. బాలుడి త‌ల్లి మాన‌సిక ప‌రిస్థితి సరిగాలేద‌ని.. ఆస్ప‌త్రిలో చికిత్స అందించిన త‌రువాత రిమాండ్‌కు త‌ర‌లిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Next Story
Share it