కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా క్ష‌ణికావేశంలో ఓ మ‌హిళ త‌న ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ విషాద ఘ‌ట‌న పెద్దప‌ల్లి జిల్లాలోని నిమ్మ‌న‌ప‌ల్లిలో చోటుచేసుకుంది. ఎతిరాజు విజయ (25) అనే మహిళ ఇద్దరు పిల్లలు శ్రీకృష్ణ (3), కూతురు శ్రీకుర్తి (14 నెలలు) కలిసి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు పిల్లల మృతదేహాలు నీటిలో పైకి తేలాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీశారు. విజయ మృతదేహం కోసం బావిలో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.


తోట‌ వంశీ కుమార్‌

Next Story