గొంతుకోసి తల్లీకుమార్తెల దారుణ హత్య
Mother and Daughter Brutal Murder in Prakasam District.తల్లీ, కుమార్తెను దుండగులు దారుణంగా గొంతుకోసి
By తోట వంశీ కుమార్ Published on 4 Dec 2021 2:35 AM GMT
తల్లీ, కుమార్తెను దుండగులు దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రవికిషోర్.. భార్య శ్రీదేవీ(43), కుమారై లేఖన(21)లతో కలిసి టంగుటూరులో నివాసం ఉంటున్నాడు. ఇతను బంగారం వ్యాపారం చేస్తుంటాడు. రోజులాగానే శుక్రవారం ఉదయం షాపుకు వెళ్లాడు. రాత్రి 8.20 గంటలకు ఇంటికి వచ్చి చూసే సరికి భార్య. కుమారై గొంతుకోసిన స్థితిలో, తీవ్రమైన రక్తస్రావమై అచేతనంగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా.. తల్లీ, కుమారైలు రాత్రి 8 గంటల ప్రాంతంలో పొరుగింటి వారితో మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. 8.20 వారు చనిపోయిన స్థితిలో కనిపించారు. 20 నిమిషాల వ్యవధిలో వారిద్దరు చనిపోవడం, ఇంట్లో నగలు చోరికి గురికావడంతో వీరికి ఎవరైనా శత్రువులు ఉన్నారా..? అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. మూడు నెలల క్రితం రవికిషోర్ సోదరుడు రంగాకు చెందిన బంగారం ఆభరణాల దుకాణంలోనూ 800 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.