విషాదం.. కూతురిని నడుముకు కట్టుకుని తల్లి ఆత్మహత్య
Mother along with Daughter commits suicide in Mahabubnagar District.కుటుంబ కలహాల నేపథ్యంలో తొమ్మిది నెలల
By తోట వంశీ కుమార్ Published on 2 Dec 2021 6:37 AM GMT
కుటుంబ కలహాల నేపథ్యంలో తొమ్మిది నెలల చిన్నారితో సహా ఓ మహిళ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన సరిత(20)కు మిడ్జిల్ గ్రామానికి చెందిన శ్రీశైలంతో రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరు మిడ్జిల్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. వీరికి 9 నెలల కుమారై సంతానం.
రెండు రోజుల క్రితం కుటుంబ కలహాల నేపథ్యంలో సరిత.. తన కుమారైను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో తల్లీ, కుమారైలు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను నీటిలోంచి వెలికితీయించారు. 9నెలల కుమారైను సరిత తన నడుముకు కట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.