12 రోజుల క్రితం అదృశ్యమైన గాయని.. ఓ వంతెన కింద శవంగా
Missing Haryanvi singer Sangeeta found dead in Rohtak.అదృశ్యమైన హరియాణాకు చెందిన గాయని దివ్య ఇండోరా అలియాస్
By తోట వంశీ కుమార్ Published on 24 May 2022 12:56 PM ISTఅదృశ్యమైన హరియాణాకు చెందిన గాయని దివ్య ఇండోరా అలియాస్ సంగీత ఘటన విషాదాంతమైంది. ఆమె కనిపించకుండా పోయిన 12 రోజుల తరువాత రోహ్‌తక్ జిల్లాలో ఓ వంతెన కింద పాతిపెట్టిన.. గాయని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. 26 ఏళ్ల సంగీత ఢిల్లీలో నివసిస్తోంది. ఆమె తన మ్యూజిక్ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేది. మే 11న ఆమె పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కుమారై ఇంటికి రాకపోవడం, ఫోన్ చేయకపోవడం, తాము చేసినా కలవకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురైయ్యారు. తమ కుమారై అదృశ్యమైనట్లు మూడు రోజుల తరువాత ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మ్యూజిక్ ఆల్బమ్ చేసే వంకతో తమ కుమారైతో పనిచేస్తున్న రవి,రోహిత్‌లు తమ కుమారైను కిడ్నాప్ చేసి ఉంటారని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రోహ్‌తక్ మెహమ్ సమీపంలోని ఓ హోటల్‌లో ఆ ముగ్గురు కలిసి భోజనం చేసిన ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి. ఆ తరువాత ఏం జరిగిందనేది తెలియరాలేదు. ఈ క్రమంలో ఆదివారం(మే 22)న భైరోన్ భైనీ గ్రామంలోని బర్సాతి డ్రెయిన్ దగ్గర్లోని ఫ్లై ఓవర్ సమీపంలో తవ్వకాలు చేపట్టగా.. ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని ఖననం చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ మృతదేహాం అదృశ్యమైన గాయని దిగా గుర్తించారు.
కాగా.. ఈ ఘటనలో ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకరి త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. మరో వైపు తమ కుమారైను దారుణంగా హత్యమార్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కాగా.. గాయని మృతదేహాం నగ్నంగా కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని కుటుంబ సభ్యలు అనుమానిస్తున్నారు. గాయని మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.