16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
Minor Girl Gangrape in Belagavi.దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం
By తోట వంశీ కుమార్ Published on 28 Aug 2021 11:15 AM ISTదేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంధులు రోజు రోజుకు బరితెగిస్తున్నారు. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్లను కూడా వదలడం లేదు. తాజాగా 16 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బెళగావి జిల్లాలోని గోకాక్ తాలూకాలోని ఘటప్రభా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివసిస్తోంది. 20 రోజుల క్రితం 16 ఏళ్ల బాలిక వ్యవసాయ క్షేత్రానికి వెలుతోంది. అదే గ్రామానికి చెందిన నలుగురు ఒంటరిగా వెలుతున్న బాలికను గమనించారు. అనంతరం బాలికను అడ్డగించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీని గురించి ఎవరైనా చెబితే.. చంపేస్తామని బాలికను బెదిరించారు.
దీంతో బాలిక విషయాన్ని ఎవ్వరికి చెప్పలేదు. ఇదే అదునుగా బావించిన దుండగులు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కోలుకున్న అనంతరం తల్లిదండ్రులతో కలిసి ఘటప్రభ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి 10గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.