గంజాయి మత్తులో ఘర్షణ.. స్నేహితుడిపై కత్తితో దాడి

Minor Boy Attack on Man.. ఏడుపుతో దద్దరిల్లిపోయింది. సోహెల్‌ ఏడుపును ఆపడం ఎవరి తరం కాలేదు

By సుభాష్  Published on  16 Nov 2020 3:02 AM GMT
గంజాయి మత్తులో ఘర్షణ.. స్నేహితుడిపై కత్తితో దాడి

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి రామవరప్పాడులోని హనుమాన్‌నగర్‌లో గంజాయి మత్తులో స్నేహితుడిపై ఓ మైనర్‌ బాలుడు కత్తితో దాడికి దిగాడు. ఓ చిన్న విషయంలో ఘర్షణ తలెత్తి వివాదం చెలరేగింది. బాలుడు కోపంతో కత్తితో మరో వ్యక్తి అయిన సురేంద్రపై దాడి చేశాడు. దీంతో అతని గొంతులో బలమైన గాయం కాగా, అపార్ట్‌ మెంట్‌లోకి పరుగులు పెడుతూ అపస్మారక స్థితిలో పడిపోయా డు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో దాడి చేసిన బాలుడు పరారయ్యాడు.

ఈ ఘటనపై సీఐ సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఘటన స్థలాన్ని పరిశీలించామని, మద్యం గానీ, గంజాయి గానీ తాగినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేవని అన్నారు. దాడికి పాల్పడిన బాలుడు పరారీలో ఉన్నాడని, ఆ ప్రాంతంలో రోజూ గంజాయి తాగుతూ యువకులు భయాందోళనకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story
Share it