బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా బ్యాగ్‌.. తెరిచి చూడగా..

కేరళలోని వాయనాడ్‌లోని మూలితోడు వంతెన సమీపంలో సంచిలో మృతదేహం లభ్యమైంది. బాధితుడిని వలస కూలీగా గుర్తించారు.

By అంజి  Published on  1 Feb 2025 10:03 AM IST
Migrant worker, body found in bag, bridge, Wayanad, custody

బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా బ్యాగ్‌.. తెరిచి చూడగా..

కేరళలోని వాయనాడ్‌లోని మూలితోడు వంతెన సమీపంలో సంచిలో మృతదేహం లభ్యమైంది. బాధితుడిని వలస కూలీగా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరో వలస కూలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శరీర భాగాలతో కూడిన బ్యాగ్‌ను వంతెన సమీపంలోని ఆటో రిక్షా డ్రైవర్‌ గుర్తించారు. డ్రైవర్ బ్యాగ్‌ని గమనించి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు విచారణ జరుపుతున్నారని, నేరానికి సంబంధించిన మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు.

అంతకుముందు కేరళ ప్రభుత్వం నరభక్షకురాలిగా ప్రకటించిన పులి వాయనాడ్‌లో శవమై కనిపించింది. అటవీ ప్రాంతంలో కాఫీ గింజలు సేకరిస్తున్న మహిళను ఆ జంతువు చంపేసింది. నిరసనల నేపథ్యంలో పులిని కాల్చిచంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అటవీశాఖ అధికారులు పులిని వెతికి పట్టుకుని చూడగా పిలకవ్ ప్రాంతంలో చనిపోయి కనిపించింది. చారల నమూనాలను సరిపోల్చడం ద్వారా అధికారులు దాని గుర్తింపును ధృవీకరించారు.

చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకరియా మాట్లాడుతూ పులికి గాయాలు అయ్యాయని, మరో పులితో పోరాడి ఉండవచ్చని తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతికి గల ఖచ్చితమైన కారణం నిర్ధారిస్తామని అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ కెఎస్ దీప తెలిపారు. ఆ శాఖ కెమెరాల ద్వారా పులిని పర్యవేక్షించింది.

Next Story