సెక్స్‌ రాకెట్‌ కేసులో బీజేపీ నేత అరెస్ట్‌

Meghalaya BJP Leader, Accused Of Running Brothel, Arrested In UP. మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్‌ ఎన్‌ మారక్‌.. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలో ఉన్న తన

By అంజి
Published on : 27 July 2022 11:43 AM IST

సెక్స్‌ రాకెట్‌ కేసులో బీజేపీ నేత అరెస్ట్‌

మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్‌ ఎన్‌ మారక్‌.. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలో ఉన్న తన ఫామ్‌హౌస్‌లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారని ఆరోపణలు రావడంతో అతడిపై పోలీసులు ఐదు రోజుల కిందట కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో బెర్నార్డ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం, మేఘాలయలోని స్థానిక కోర్టు అనైతిక అక్రమ రవాణా చట్టం, 1956 కింద ఒక కేసులో మారక్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

''మేం మారక్‌ అరెస్ట్‌ వారెంట్‌ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెప్పాం. మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు హపూర్ జిల్లాలో అతనిని పట్టుకున్నారు. తమ బృందం ఇప్పటికే యూపీకి బయలుదేరింది. అతన్ని హాపూర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత, మేము అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పైకి తీసుకువెళ్ళి విచారణ కోసం తురాకు తీసుకువస్తాము.'' అని వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ విఎస్ రాథోడ్ చెప్పారు. అయితే తాను అమాయ‌కుడిన‌ని, సీఎం కాన్రాడ్ సంగ్మా రాజ‌కీయ కుట్ర‌తో త‌న‌ను ఇరికించిన‌ట్లు బెర్నార్డ్ ఆరోపించారు.

తురా పట్టణంలోని బెర్నార్డ్‌ మరాక్‌ ఫాం‌మ్‌హౌస్‌లో నడుస్తోన్న సెక్స్ రాకెట్‌ను ఇటీవలే పోలీసులు బయటపెట్టారు. గుట్టుగా సెక్స్‌ రాకెట్‌ నడుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక రైడ్‌ చేశారు. ఈ తనిఖీల్లో ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. ఈ సెక్స్‌ రాకెట్‌ దందాతో సంబంధం ఉన్న 73 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో 23 మంది మహిళలు ఉన్నారు. రక్షించిన చిన్నారులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఫాంహౌసులో 30 చిన్న గదులు ఉన్నాయి. పోలీసుల తనిఖీల్లో 400 మందు బాటిళ్లు, 500కు పైగా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, 47 మొబైల్‌ ఫోన్లు, 8 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story