భార్యతో వివాహేతర సంబంధం.. వ్యక్తిని కాల్చి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సినీ ఫక్కీలో ఒక హత్య జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో...
By - అంజి |
భార్యతో వివాహేతర సంబంధం.. వ్యక్తిని కాల్చి చంపిన భర్త
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సినీ ఫక్కీలో ఒక హత్య జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఒక వ్యక్తి, తన భార్య ప్రియుడిని మార్కెట్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే కాల్చి చంపాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వీడియోలు పోస్ట్ చేస్తూ, పోలీసుల ముందే నిశ్చింతగా బీడీ తాగి లొంగిపోయాడు. మీరట్‌లోని రామ్‌రాజ్ ప్రాంతంలో సురేంద్ర (28) అనే యువకుడు బుధవారం మధ్యాహ్నం తన మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా.. ముసుగు ధరించిన ప్రదీప్ అనే వ్యక్తి వెనుక నుంచి వచ్చి సురేంద్ర నడుముపై కాల్పులు జరిపాడు. సురేంద్ర కింద పడిపోగానే, ప్రదీప్ దగ్గరకు వెళ్లి మళ్లీ కాల్చి చంపి అక్కడి నుండి పరారయ్యాడు.
ఆసుపత్రికి తరలించే లోపే సురేంద్ర మరణించాడు. హత్య చేసిన తర్వాత ప్రదీప్ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశాడు. అందులో తుపాకులు పట్టుకుని.. "నేనే ఈ హత్య చేశాను, ప్రతీకారం తీర్చుకున్నాను" అని ఒప్పుకున్నాడు. అంతటితో ఆగక, తన భార్యను కూడా చంపేస్తానని బెదిరించాడు. మీరట్ ఎస్ఎస్పీకి కూడా ఈ వీడియో పంపాలని సవాలు విసిరాడు. పోలీసులు ప్రదీప్‌ను పట్టుకోవడానికి ఆపరేషన్ నిర్వహించగా, అతను పోలీసులకు చిక్కాడు.
అయితే, పోలీసులు చుట్టుముట్టిన సమయంలో ప్రదీప్ ఏమాత్రం భయం లేకుండా, నిశ్చింతగా ఒక బీడీ వెలిగించి తాగాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. "గత ఏడాదిన్నరగా నా ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని పోలీసుల ముందే అరిచాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ప్రదీప్ భార్య ఏడాదిన్నర క్రితమే భర్తను వదిలేసి సురేంద్రతో కలిసి నివసిస్తోంది. ఈ మనస్తాపంతోనే ప్రదీప్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.