కాకినాడలో వైద్య విద్యార్థిని దారుణ‌హత్య

Medicine student brutally killed in Kakinada.వారిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఓ విష‌యంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2021 5:26 AM GMT
కాకినాడలో వైద్య విద్యార్థిని దారుణ‌హత్య

వారిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య ఓ విష‌యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. స‌హ‌నం కోల్పోయిన భ‌ర్త.. క‌త్తితో భార్య‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడిక్క‌డే మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో జ‌రిగింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం కాకిపాడుకు చెందిన సుధారాణి (19) కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో డిప్లొమా ఇన్‌ ఎనస్తీషియా ప్రథమ సంవత్సరం చదువుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం యాళ్లగూడేనికి చెందిన 21 ఏళ్ల మానేపల్లి గంగరాజుతో ఆమెకు పరిచయమైంది.

ఆ ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా మారింది. ప‌దినెల‌ల క్రితం ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నారు. సుధారాణి హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుకుంటుంది. ఈ నెల 17న భ‌ర్త కాకినాడ రావ‌డంతో.. కోకిల సెంట‌ర్‌లోని ద్వార‌కా లాడ్జిలో దిగారు. ఆదివారం రాత్రి ఇద్ద‌రి మ‌ధ్య ఏదో విష‌యంలో వాగ్వాదం చోటుచేసుకుంది. గంగరాజు క్షణికావేశంలో పదునైన ఆయుధంతో సుధారాణిపై విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో సుధారాణి అక్క‌డిక్క‌డే మృతి చెందింది. అనంత‌రం గంగరాజు అక్క‌డి నుంచి పారిపోయి.. సోమ‌వారం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. అక్క‌డి పోలీసులు ఇచ్చిన సమాచారం మేర‌కు.. సోమ‌వారం రాత్రి ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న కాకినాడ పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it