Medchal: దారుణం.. రూ.100 కోసం వ్యక్తి హత్య
మేడ్చల్‌లోని వెంకటరమణారెడ్డి కాలనీకి చెందిన పోచయ్య (45) కూలీ పనులు చేయిస్తూ ఉంటాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2024 3:30 AM GMTMedchal: దారుణం.. రూ.100 కోసం వ్యక్తి హత్య
చిన్న చిన్న కారణాలకే గొడవలు పడుతున్నారు. క్షణికావేశంలో కొందరు ఇతరులపై దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేస్తున్నారు. మరికొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయినవారు ఉన్నారు. ఇటీవల ఆటో డ్రైవర్, ఓ యువకుడి మధ్య రూ.10 కోట్ల ఘర్షణ డ్రైవర్‌పై దాడి చేసి అతను చనిపోయే వరకూ వెళ్లింది. తాజాగా ఇలాంటి ఘటనే మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. రూ.100 అడిగితే ఇవ్వడం లేదని ఓ యువకుడు గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత హత్య చేశాడు.
మేడ్చల్‌లోని వెంకటరమణారెడ్డి కాలనీకి చెందిన పోచయ్య (45) కూలీ పనులు చేయిస్తూ ఉంటాడు. ఇతని దగ్గర ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు పని చేస్తుంటారు. వీరిలో ఒకరే మధ్యప్రదేశ్‌కి చెందిన యువకుడు. శనివారం రూ.100 కావాలంటూ పోచయ్యను అడిగాడు యువకుడు. దానికి పోచయ్య తన దగ్గర క్యాష్ లేదనీ.. అమౌంట్ బ్యాంకులో ఉందని చెప్పాడు.రేపు ఇస్తానని చెప్పాడు. కానీ.. యువకుడు తనకు రూ.100 కావాల్సిందే అంటూ పట్టుబట్టాడు. చెప్తే వినకపోవడంతో పోచయ్య యుకుడిని కసురుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఘర్షణ పడ్డారు.
ఆగ్రహంతో యువకుడు పోచయ్యపై బండరాయితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన పోచయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు బోరున విలపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.