మద్యం కొట్టేసే మాస్క్ మ్యాన్.. ఎక్కడో తెలుసా?
నల్గొండ జిల్లా గుర్రంపోడులోని ఓ వైన్‌షాప్‌లో దొంగతనం
By Medi Samrat Published on 13 Oct 2024 1:46 PM GMTనల్గొండ జిల్లా గుర్రంపోడులోని ఓ వైన్‌షాప్‌లో దొంగతనం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు పైకప్పును పగులగొట్టారు. దొంగిలించిన మొత్తం మద్యం విలువ రూ. 12 లక్షలు ఉంటుంది. ముసుగు ధరించిన దొంగ కరెన్సీ నోట్లను లెక్కిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వైన్ షాపు యజమాని ఆదివారం షాపు తెరిచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించారు. చోరీకి పాల్పడింది ఒక్కరేనని ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. సమాచారం అందుకున్న గుర్రంపోడు ఎస్‌ఐ నారాయణరెడ్డి బృందం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
దసరా పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మద్యం, బీర్ల విక్రయాలు భారీగా జరిగాయి. శని, ఆదివారాల్లో వైన్ షాపుల్లో భారీగా విక్రయాలు జరిగాయి. అధిక విక్రయాలు జరుగుతాయని ముందుగానే ఊహించి, తెలంగాణలోని వైన్ షాపు యజమానులు ముందస్తుగా ఇండెంట్ వేసి భారీగా మద్యం, బీర్ నిల్వ చేశారు. ఈ పండుగ సీజన్‌లో ఐదు జిల్లాల్లో బీర్ల విక్రయాలు భారీగా తగ్గడం ఎక్సైజ్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసారి హైదరాబాద్ I, హైదరాబాద్ II, ఖమ్మం, మేడ్చల్-1, నల్గొండ, యాదాద్రి డిపోలలో తక్కువ బీర్ అమ్మకాలు నమోదు అయ్యాయి.
Next Story