చ‌నిపోయిన వ్య‌క్తిని బ‌తికిస్తాన‌ని శ‌వం ద‌గ్గ‌ర పూజ‌లు

Man who perform rituals at dead body to resurrect.ఆధునికి విజ్ఞానం ఎంతో అభివృద్ది చెందింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Aug 2021 4:29 AM GMT
చ‌నిపోయిన వ్య‌క్తిని బ‌తికిస్తాన‌ని శ‌వం ద‌గ్గ‌ర పూజ‌లు

ఆధునిక విజ్ఞానం ఎంతో అభివృద్ది చెందింది. అయిన‌ప్ప‌టికి కొంద‌రు మూఢ న‌మ్మ‌కాల‌ను వీడ‌డం లేదు. చనిపోయిన వ్య‌క్తిని బ‌తికిస్తాన‌ని చెప్పి.. ఓ వ్య‌క్తి శవం ద‌గ్గ‌ర పూజ‌లు చేశాడు. ఈ ఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లాలో జరిగింది. వివ‌రాల్లోకి వెళితే.. జ‌గిత్యాల రూర‌ల్ మండ‌లం టీఆర్‌న‌గ‌ర్‌కు చెందిన ఓర్సు ర‌మేశ్ అనారోగ్యంతో శుక్ర‌వారం ఉద‌యం మృతి చెందాడు. బంధువులు అత‌డి మృత‌దేహాన్ని టీఆర్‌న‌గ‌ర్‌లోని ఇంటి ముందు ఉంచారు.

కాగా.. మంత్రాల కార‌ణంగానే ర‌మేశ్ మృతి చెందాడ‌ని పుల్ల‌య్య అనే వ్య‌క్తిని బాధిత కుటుంబ స‌భ్యులు చిత‌క‌బాది తాళ్ల‌తో క‌ట్టేశారు. దీంతో తానే మంత్రాల‌తో ర‌మేశ్ ను చంపాన‌ని.. మ‌ళ్లీ మంత్రాల‌తో ర‌మేశ్‌ను బ‌తికిస్తాన‌ని చెప్ప‌డంతో బంధువులు అత‌డి క‌ట్లు విప్పారు. ఉద‌యం నుంచి శ‌వం ద‌గ్గ‌ర పుల్ల‌య్య పూజ‌లు చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఈ విష‌యం తెలిసి స్థానికులు అక్క‌డ పెద్ద సంఖ్య‌లో గుమిగూడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పుల్లేశ్​ను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉంటే.. మంత్రాలు వేస్తే బతుకుతాడని, తమకు మృతదేహాన్ని అప్పగించాలని జగిత్యాల – కరీంనగర్ రహదారిపై మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. డాక్టర్లు పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో పోలీసులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే.. మృతదేహాన్ని దహనం చేసేది లేదని, కొమ్మరాజుల పుల్లేశ్​ను తమకు అప్పగిస్తే మళ్లీ బతికించుకుంటామని బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు టీఆర్‌న‌గర్ లో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story