ప్రేయసి ఫోన్ ఎత్తడంలేదని.. యువకుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 29 May 2024 8:32 AM ISTప్రేయసి ఫోన్ ఎత్తడంలేదని.. యువకుడు ఆత్మహత్య
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదనీ.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేయసి పుట్టిన రోజునే ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలమంచిలి పట్టణంఓలని ద్వారకానగర్‌లో రోమాల గంగాధర్ (27) అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం బాగానే ఉన్నా.. గత ఏడాది క్రితం యువతి అతడిని దూరం పెట్టింది. కారణాలేంటో తెలియదు కానీ.. మాట్లాడటం మానేసింది. దాంతో.. గంగాధర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అప్పట్నుంచి బాధలోనే ఉన్నారు. ఇక గత సోమవారం మే 27వ తేదీన యువతి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు విషెస్ చెప్పాలనీ.. మాట్లాడాలని ప్రయత్నించాడు గంగాధర్. యువతికి పలుమార్లు ఫోన్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. దాంతో.. మరోసారి తీవ్ర మనస్తాపం చెందిన గంగాధర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం రాత్రే ఇంట్లో ఉన్న వంటగదిలో ఫ్యాన్ హుక్కుకి ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గంగాధర్ మృతదేహం వేలాడుతూ ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని ఎలమంచిలి పోలీసులు తెలిపారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించామని చెప్పారు. కేసు ను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చేతికి ఎదిగిన కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. స్థానికంగా విషాదాన్ని నింపింది.