Hyderabad: సెల్‌ఫోన్ పోయిందని యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తన ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 24 Sep 2023 7:43 AM GMTHyderabad: సెల్‌ఫోన్ పోయిందని యువకుడు ఆత్మహత్య
ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటుంది. వయసుతో సంబంధం కూడా లేకుండా పోయింది. ఉదయం లేవ్వగానే ఫోన్ చూస్తున్నారు. ఒక్క నిమిషం స్మార్ట్ ఫోన్ కనపడకపోతే చాలు.. కంగారుపడిపోతారు. ఒకవేళ ఫొన్ దగ్గర లేకపోతే ఏదో పొగొట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. మొత్తంమీద జనాలు సెల్‌ఫోన్‌కు బాగా అడిక్ట్ అయ్యారు. దాంతో.. ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అలాగే ఉంటున్నాయి. కొందరు వీటికి బానిసలై జీవితాలను కోల్పోయారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ కొనివ్వడం లేదని.. ఎక్కువగా వాడనివ్వడం లేదంటూ ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి తన ఫోన్ పోయిందని ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఈ సంఘటన. వేల రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు నితీశ్ రాజు (26). ఎల్లమ్మబండ కేటీఆర్ కాలనీలో నివిస్తున్నాడు నితీశ్. అయితే.. ఇటీవల కొన్న స్మార్ట్ ఫోన్‌ను పోయింది. దాంతో.. యువకుడు తీవ్ర మనస్తాపం చెందాడు. రూపాయి రూపాయి ఒక్కదగ్గర పోగేసి కొన్న ఫోన్ ఒక్కసారిగా కనిపించకపోవడంతో బాధపడ్డాడు. దాంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి మృతి గురించి స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.