కూతురిని వేధిస్తున్నాడని.. అల్లుడిపై మామ కత్తితో దాడి

Man stabs son in law in Piduguralla.చెడు వ్య‌స‌నాల‌కు బానిసైన భ‌ర్త‌.. భార్య‌ను వేదింపుల‌కు గురిచేసేవాడు. అత‌డి వేదింపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Oct 2021 3:01 PM IST
కూతురిని వేధిస్తున్నాడని.. అల్లుడిపై మామ కత్తితో దాడి

చెడు వ్య‌స‌నాల‌కు బానిసైన భ‌ర్త‌.. భార్య‌ను వేదింపుల‌కు గురిచేసేవాడు. అత‌డి వేదింపులు రోజు రోజుకు పెరిగిపోతుండ‌డంతో పాటు ఎంత మంది చెప్పినా అత‌డిలో మార్పు రావ‌డం లేదు. కుమారై ప‌డుతున్న క‌ష్టాన్ని చూడ‌లేక‌.. అల్లుడిపై (కుమారై భ‌ర్త‌) మామ‌, త‌న కొడుతో క‌లిసి దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. ఈ ఘ‌ట‌న గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల మండ‌లంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. తుమ్మలచెరువు గ్రామానికి చెందిన చిన్న కాశిం చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. రోజు భార్య‌ను మాన‌సికంగా, శారీర‌కంగా వేదించేవాడు. చిన్న కాశిం పెట్టె బాధ‌ల‌ను త‌న కుటుంబంతో చెప్పుకుని బాద‌ప‌డేది అత‌డి భార్య‌. ఈ క్ర‌మంలో ఎన్నో సార్లు భార్య కుటుంబ స‌భ్యులు చెప్పినా అత‌డి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేదు. పైగా అత‌డి వేదింపులు రోజు రోజుకు ఎక్కువ అయ్యాయి. ఈ విష‌య‌మై అల్లుడైన చిన్న కాశింను అత‌డి మామ ప్ర‌శ్నించాడు.

ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య ఘ‌ర్ష‌ణ త‌లెత్తింది. ఈ గొడ‌వ‌లో చిన్న కాశింపై అత‌డి మామ‌, బావ మ‌రిది క‌త్తితో దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో చిన్న కాశిం తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌డిని చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు మామా పిరు సాహెబ్, బావ మరిది భాషాలను అదుపులోకి తీసుకున్నారు.

Next Story