దారుణం.. ప్రియురాలితో పాటు ఆమె తల్లి సజీవదహనం
Man sets woman and her mother on fire kills self in Tamil nadu.ప్రేమించిన ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం
By తోట వంశీ కుమార్ Published on 6 Feb 2021 10:28 AM ISTప్రేమించిన ప్రియురాలికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. మరో వారంలో పెళ్లి జరగనుంది. ప్రేమికులు రాలు తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లిచేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిపై, ఆమె తల్లిపై కిరోసిన్ పోసి నిప్పటించి సజీవదహనం చేశాడు. వారితో పాటు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై కొరుక్కుపేట అనంతనాయగినగర్‌కు చెందిన వెంకటమ్మ (50), వెంకటేశన్ దంపతులకు కుమార్తె రజిత (24) ఉంది. కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తూ వెంకటేశన్ కొంతకాలం క్రితం మృతి చెందాడు.
దీంతో ఆ ఉద్యోగం కుమారై రజితకు వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన భూపాలన్ కుమారుడు సతీష్ (32) కార్పొరేషన్‌లో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి ప్రేమకు తల్లి వెంకటమ్మ నిరాకరించింది. అంతేకాకుండా రజితకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని నిశ్చయించింది. ఆమెకు రహస్యంగా నిశ్చితార్థం చేసింది. ఈ విషయం తెలిసిన సతీశ్ ఆగ్రహాంతో శుక్రవారం తెల్లవారుజామున వెంకటమ్మతో గొడవకు దిగాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కిరోసిన్ వెంకటమ్మ, రజితపై పోయడంతో పాటు తనపైనా పోసుకున్నాడు.
అనంతరం నిప్పంటించుకున్నాడు. మంటల ధాటికి తాళలేక వారు వేసిన కేకలతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చే లోపే ముగ్గురు సజీవదహనం అయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.