బొల్లారంలో దారుణం.. భార్య, అత్త దారుణహత్య
Man killed his wife and aunty.సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో ఓ వ్యక్తి తన భార్యతో పాటు అత్తను దారుణంగా హత్య చేశాడు.
By తోట వంశీ కుమార్ Published on
11 April 2021 8:57 AM GMT

సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యతో పాటు అత్తను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఐడీఏ బొల్లారంలోని గాంధీనగర్‌లో నర్సింహా దంపతులు నివాసం ఉంటున్నారు. నర్సింహ ఎలక్ట్రీషయన్ పనిచేస్తున్నాడు. భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో అతడి భార్య పుట్టింటికి వెళ్లింది. తిరిగి భర్తకు వచ్చేందుకు నిరాకరిస్తోంది. భార్య కాపురానికి రాకపోవడంతో నర్సింహా ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ఆదివారం తెల్లవారు జామున నర్సింహ తన భార్య స్వరూప, అత్త ఎల్లమ్మపై కత్తితో దాడి చేశాడు.
దీంతో వారిద్దరికి తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకున్నారు.
Next Story