బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కొంత మందికి యూరిన్ రాడవం జరుగుతుంటుంది. కొందరు కంట్రోల్ చేసుకోగా.. మరికొందరు డ్రైవర్ ను రిక్వెస్ట్ చేసి బస్సును ఆపమని కోరి.. తమ తమని పూర్తి చేసేస్తారు. ఓ భార్య.. తన భర్తను బస్సు ఎక్కించింది. బస్సు ఓ అరకిలోమీటర్ వెళ్లగానే భర్తకి అర్జెంట్‌గా యూరిన్ కి వెళ్లాల్సి రావడంతో.. బస్సు డ్రైవర్‌ను బస్సు ఆపాలని కోరాడు. బస్సు డ్రైవర్ బస్సును ఆపే లోపే తెరిచి ఉన్న డోర్‌లోంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతడి తలకి తీవ్ర గాయాలు కావడంతో.. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పొలంసాయన్నోల రాములు (50) తాపీ మేస్త్రీగా పనిచేస్తుంటాడు. ముంబాయి వెళ్లడానికి రావల్‌పల్లి గ్రామం వద్ద బుధవారం సాయంత్రం ఆయన్ను భార్య మదారమ్మ బస్సు ఎక్కించింది. బస్సు రావల్‌పల్లి గ్రామం దాటి అరకిలోమీటర్ వెళ్లగానే.. రాములు మూత్రం వస్తోందని బస్సు ఆపాలని డ్రైవర్‌ను కోరాడు. రోడ్డు పక్కకు ఆపుతానని డ్రైవర్ చెప్పాడు. అంతలోనే తెరచి ఉన్న తలుపు నుంచి రాములు కిందకి దూకాడు. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.