యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు ఓ యువకుడు. అయితే వరుసకు అన్న కావడంతో అతడి ప్రేమను యువతి నిరాకరించింది. దీంతో ఉన్మాదిలా మారిపోయాడు. యువతిని మట్టుబెట్టాలని అనుకున్నాడు. అంతే యువతి స్కూటీపై వెలుతుండగా కారుతో ఢీ కొట్టాడు. ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే అసలు విషయం వెలుగు చూడడంతో పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కల్యాణదుర్గంలో భాస్కర్ అనే యువకుడు మైథిలి అనే యువతిని ప్రేమ పేరుతో వేదిస్తున్నాడు. అయితే.. వరుసకు అతడు అన్న కావడంతో మైథిలి అతడి ప్రేమను తిరస్కరించింది. ఈ విషయాన్ని లైట్ తీసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో మైథిలిపై భాస్కర్ కక్ష పెంచుకున్నాడు. స్కూటీపై వెళుతున్న మైథిలిని బోయలపల్లి వద్ద కారుతో ఢీకొట్టాడు భాస్కర్. ఈ ప్రమాదంలో మైథిలికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మైథిలిని ఢీ కొట్టిన అనంతరం భాస్కర్ వేగంగా వెలుతూ అదుపు తప్పి కొద్ది దూరంలోనే ఉన్న పొలాల్లోకి దూసుకువెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు.