బర్రెపై అత్యాచారం చేస్తూ వ్యక్తి మృతి..!
Man Dies Buffalo tail around his neck in Wanaparthy.కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు
By తోట వంశీ కుమార్ Published on 15 Aug 2021 1:21 PM ISTకామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులకు కన్నుమిన్ను కానడం లేదు. మహిళలపైనే కాకుండా మూగజీవాలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మూగజీవాలపై అఘాయిత్యాలకు పాల్పడితే.. అవి ఎవరికి చెప్పుకోలనే ధైర్యమో మరి ఇంకొకటో తెలీదు కానీ వాటిపై పడి తమ వాంఛ తీర్చుకుంటున్నారు. ఎవరు చేసిన పాపానికి వారే బలి అవుతారు అన్న చందంగా.. ఓ వ్యక్తి బర్రెపై అత్యాచారానికి పాల్పడుతూ.. దాని తోక మెడకు చుట్టుకుని మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరంలో 45 ఏళ్ల ఆంజనేయులు అనే వ్యక్తి రోజు వారి కూలీ పని చేసేవాడు. బాల్‌రెడ్డి అనే వ్యక్తి తనకు ఉన్న గేదెలను ఇంటి దగ్గర కట్టేశాడు. ఉదయం అతడు లేచి చూసే సరికి.. ఓ గేదె తోక మెడ కు బిగుసుకొని విగతజీవిగా ఉన్న స్థితిలో ఆంజనేయులు కనిపించాడు. దీంతో అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు జరిపారు. బర్రెపై అత్యాచారం చేస్తున్న సమయంలో బర్రె తోక ఆంజనేయులు మెడకు చుట్టుకుని అతడు మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
కాగా.. అంజనేయులు గతంలో ఇలాగే పశువులపై అత్యాచారం చేస్తూ ఓ సారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా.. దేహశుద్ది చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. స్తంబానికి గంటల తరబడి కట్టేసినట్లు చెప్పారు. అయినప్పటికి అతడి బుద్ది మారలేదన్నారు. చివరకు అతడు చేసిన పాపం అతడికే చుట్టుకున్నట్లు చెబుతున్నారు.