ఆగి ఉన్న కారులో మృత‌దేహాం క‌ల‌క‌లం

Man Dead body found in car.విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆగి ఉన్న కారులో ఓ మృత‌దేహం కనిపించ‌డం క‌ల‌క‌లం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Aug 2021 12:14 PM IST
ఆగి ఉన్న కారులో మృత‌దేహాం క‌ల‌క‌లం

విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆగి ఉన్న కారులో ఓ మృత‌దేహం కనిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. మాచ‌వ‌రం ప‌రిధిలోని డీవీ మ్యాన‌ర్ హోట‌ల్ ప‌క్క సంధులో బ్లాక్ ఎండీవర్ కారు పార్క్ చేసి ఉంది. అందులో మృత‌దేహం క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు.. కారు లాక్ ఓపెన్ చేశారు. మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతుడిని తాడిగ‌డ‌ప‌కు చెందిన క‌ర‌ణం రాహుల్‌గా గుర్తించారు. జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నట్లు సమాచారం. కాగా.. వ్యాపారంలో అత‌డికి విభేదాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా..? లేక ఏవ‌రైనా హ‌త్య చేశారా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Next Story