బెయిల్‌పై వ‌చ్చి మ‌ళ్లీ అదే త‌ప్పు చేశాడు.. మైనర్ బాలిక‌ కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడికి క‌ఠిన శిక్ష

ఉత్త‌రాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్‌లో 15 ఏళ్ల బాలికను రెండుసార్లు అపహరించి అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన దేవేంద్ర అనే నిందితుడికి కోర్టు శిక్ష విధించింది.

By -  Medi Samrat
Published on : 25 March 2026 2:10 PM IST

బెయిల్‌పై వ‌చ్చి మ‌ళ్లీ అదే త‌ప్పు చేశాడు.. మైనర్ బాలిక‌ కిడ్నాప్, అత్యాచారం కేసులో నిందితుడికి క‌ఠిన శిక్ష

ఉత్త‌రాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్‌లో 15 ఏళ్ల బాలికను రెండుసార్లు అపహరించి అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన దేవేంద్ర అనే నిందితుడికి కోర్టు శిక్ష విధించింది. నిందితుడిపై రెండు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత, అతడు అదే యువతిని అపహరించి ఆమెపై అత్యాచారం చేశాడు. కోర్టు అతడిని రెండు కేసుల్లోనూ దోషిగా నిర్ధారించి, 10 సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించింది. బాధితురాలి భవిష్యత్తు కోసం మొత్తం ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.

ప్రత్యేక న్యాయమూర్తి (పోక్సో) అర్చన సాగర్ ఎదుట తన వాదనలో.. బాధితురాలు వయోజన అని, వారి మధ్య పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం జరిగిందని.. హరిద్వార్‌లో వివాహం చేసుకున్నామ‌ని నిందితుడు పేర్కొన్నాడు. విచారణ అనంతరం.. సంఘటన జరిగిన సమయంలో బాధితురాలు మైనర్ అని.. మంచి చెడులను వివేచించలేని స్థితిలో ఉందని కోర్టు అంగీకరించింది. అందువల్ల ఆమె అంగీకారం అప్రస్తుతం అని పేర్కొంది.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అల్పనా థాపా ప్రకారం.. మొదటి సంఘటన 2019 ఫిబ్రవరి 5న జరిగింది. నిందితుడు దేవేంద్ర, సహస్‌పూర్‌కు చెందిన 15 ఏళ్ల బాలికను హరిద్వార్, బిజ్నోర్‌లకు తీసుకెళ్లి ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.

నిందితుడి తెగింపు ఎంతగా పెరిగిపోయిందంటే.. బెయిల్‌పై విడుదలైన వెంటనే అతను 2019 మార్చి 28న మళ్లీ అదే బాధితురాలిని లక్ష్యంగా చేసుకుని అపహరించాడు. మొదటి, రెండవ రెండు కేసులలోనూ కోర్టు అతనికి 10 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష, మొత్తం 20,000 రూపాయల జరిమానా విధించింది. చట్ట ప్రకారం.. ఈ రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు అవుతాయి. ఈ కేసులో ప్రాసిక్యూటర్ కంచన్ పట్టుదలను ప్రదర్శించి, సాక్షులందరినీ సకాలంలో కోర్టుకు హాజరుపరిచేలా చూసుకున్నారు.

Next Story