Gold Smuggling: డైపర్‌లో బంగారం.. వార్నీ ఇదేం స్మగ్లింగ్ రా.!
భారత్‌లో బంగారానికి చాలా డిమాండ్ ఉంది.. ఉంటుంది కూడా. ఎందుకంటే మన దేశంలో మహిళలు బంగారానికి
By అంజి Published on 19 March 2023 4:09 AM GMTడైపర్‌లో బంగారం.. వార్నీ ఇదేం స్మగ్లింగ్ రా
భారత్‌లో బంగారానికి చాలా డిమాండ్ ఉంది.. ఉంటుంది కూడా. ఎందుకంటే మన దేశంలో మహిళలు బంగారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో బంగారం భారీగా కొనుగోలు చేస్తుంటారు. ఇక ప్రతిరోజూ పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ డిమాండ్ కారణంగానే విదేశాల నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్ చేస్తుంటారు. బంగారాన్ని తరలించేందుకు ఎత్తుకుపై ఎత్తులు వేస్తుంటారు. అందులోనూ బంగారం స్మగ్లింగ్ అయితే రకరకాల పద్ధతుల్లో రహస్యంగా స్మగ్లింగ్ జరుగుతుంటుంది.
తాజాగా మంగళూరు ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో ఇటీవల ఓ ప్రయాణికుడు తన 22 నెలల కుమార్తె డైపర్‌లో బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి ప్యాకెట్లలో నింపి డైపర్‌లో పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఇదే ఎయిర్‌పోర్టులో అంతకుముందు మరో ప్రయాణికుడు బంగారాన్ని రేకులా తయారు చేసి బెల్టు వెనుక దాచి తరలిస్తూ చిక్కిపోయాడు. మరో వ్యక్తి తన ప్రైవేట్ పార్టుల్లో బంగారాన్ని దాచుకుని తీసుకెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు.
ఈ సంవత్సరం మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీల మధ్యలో మంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.90.67 లక్షల విలువైన 1606 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.