పాత‌బ‌స్తీలో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

Man Brutually murdered in chandrayanagutta.హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. చాంద్రాయ‌ణ‌గుట్ట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2021 9:39 AM GMT
పాత‌బ‌స్తీలో వ్య‌క్తి దారుణ హ‌త్య‌

హైద‌రాబాద్ న‌గ‌రంలో ఓ వ్య‌క్తి దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. చాంద్రాయ‌ణ‌గుట్ట ప‌రిధిలోని బండ్ల‌గూడ‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్య‌క్తి మృత‌దేహాం క‌నిపించింది. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి పోలీసులు చేరుకున్నారు. శ‌రీరంపై దుస్తులు లేని స్థితిలో మృత‌దేహాం ఉంద‌ని, క‌త్తిపోట్లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ప‌క్క‌నే ఓ పాయింట్‌, టీష‌ర్ట్ ల‌భ్య‌మైంది. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుడి వివ‌రాలు ఇంకా తెలియ‌రాలేవు. మృతుడి వివ‌రాలు తెలిస్తే.. కేసు చిక్కుముడి త్వ‌ర‌గానే వీడ‌నుంది.

Next Story
Share it