భార్య ముక్కును కొరికిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

Man bites off estranged wife’s nose.భార్యాభర్త మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అప్పుడప్పుడు కొట్టుకుంటారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sep 2021 11:31 AM GMT
భార్య ముక్కును కొరికిన భర్త.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

భార్యాభర్త మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అప్పుడప్పుడు కొట్టుకుంటారు ఆ తరువాత మాట్లాడుకుంటారు. క్ష‌ణికావేశంలో ఓ భ‌ర్త అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆవేశంలో భార్య ముక్కును కొరికేశాడు. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆ మ‌హిళ‌ను కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని రత్లం జిల్లా అలోట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. దినేష్, టీనా లు 2008లో పెళ్లి చేసుకుని ఉజ్జయినిలో నివ‌సించేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దినేష్ కు ఉద్యోగం చేసేవాడు కాదు. మ‌ద్యానికి బానిస‌లాగా మారాడు. ప్ర‌తిరోజు మ‌ద్యం తాగి వ‌చ్చి టీనాను కొట్టేవాడు. రోజు రోజుకు అత‌డి వేదింపులు అధికం కావడంతో టీకా.. త‌న కుమారైల‌ను తీసుకుని కొంత కాలం క్రితం పుట్టింటికి వ‌చ్చేసింది. ప‌నిచేసుకుంటూ త‌న పిల్ల‌ల‌ను పోషించుకునేది. భ‌ర్త నుంచి త‌న‌కు భ‌ర‌ణం ఇప్పించాల‌ని 2019లో టీనా కోర్టును ఆశ్ర‌యించింది.

ఇటీవ‌ల టీనా ఇంటికి వెళ్లాడు దినేష్. టీనాతో పాటు ఆమె త‌ల్లిదండ్రుల‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్ర‌మంలో దంప‌తుల మ‌ధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్ర‌మంలో ఆవేశానికి లోనైన దినేష్.. టీనాపై దాడికి దిగాడు. టీనా ముక్కును ప‌ళ్ల‌తో కొరికాడు. ముక్కు మీద గాయం కావ‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావం అయ్యింది. వెంటనే టీనాను ఆమె త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. దీనిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ఆమె ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఘ‌ట‌న అనంత‌రం దినేష్ పారిపోయాడు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు దినేష్‌ను వెతికిప‌ట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.

Next Story
Share it